సమంత ఫ్యాషన్ ఐకాన్ గా మారుతుందట....

May 18, 2015 | 03:41 PM | 24 Views
ప్రింట్ కామెంట్
Samantha_wants_to_answer_North_critics_niharonline

మన దక్షిణాది తారలు ఫ్యాషన్ స్టైల్స్ లో ఉత్తరాది తారలతో పోటీ పడలేరనే ఓ టాక్ ఉంది. ఆలిండియా లెవల్ లో జరిగే సినిమా ఫంక్షన్లలో దక్షిణాది తారలను పెద్దగా పట్టించుకున్నట్టు కనపడరు. కారణం వారికి ఫ్యాషన్లు అంతగా తెలియవనే అభిప్రాయం. అయితే దీన్ని మార్చేస్తానంటోంది సమంత. కొత్తగా ట్రెండ్ సెట్ చేస్తానంటోంది. ‘‘నేను ఇప్పుడు అన్నీ పరిశీలిస్తున్నాను... దక్షిణాది తారల సత్తా ఏమిటో చూపిస్తా’’ అంటోంది. దక్షిణాది తారలు ఉత్తరాది తారలకు దేంట్లోనూ తీసిపోరంటోంది. అందుకే ఇటీవల కాలంలో ఫ్యాషన్ ఐకాన్ గా దక్షిణాది లో పేరు తెచ్చుకుంటోంది. అంటే బాలీవుడ్ సోనమ్ కపూర్ అన్నమాట సమంత. ఇప్పుడు ఓ కొత్త డిజైనర్ డ్రెస్ ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి స్ఫూర్తి ఎవరంటే... హాలీవుడ్ స్టార్ల పేర్లు చెప్పేస్తోంది. ఆడరే హెప్ బర్న్ని అనుకరిస్తున్నానంటోంది. మరి సమంత ట్రెండ్ ను మిగిలిన హీరోయిన్లూ ఫాలో చేస్తారో లేదో చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ