ఎన్నో చిత్రాల్లో కామెడి హీరోగా రాణించిన సీనియర్ నటుడు ప్రస్తుతం క్యారెక్టర్ వేషాలు వేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా సదరు సీనియర్ నటుడు నటించిన ‘చందమామ కథలు’ అనే సినిమాకి ఉత్తమ చిత్రంగా జాతీయఅవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చాణక్య బూనేటి నిర్మాంచారు. సినిమా నేషనల్ అవార్డు సాధించిన తర్వాత ఓ సందర్భంలో దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తన చిత్రాన్ని మీడియా వారు చిన్న చూపు చూశారని అందుకే సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదని విమర్శించాడు. అయితే తాజాగా సీనియర్ నరేష్ ఆంధ్రప్రదేశ్ ఫిలింఛాంబర్ పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు. చందమామ కథలు సినిమాకి నేషనల్ స్థాయిలో గుర్తింపు లభించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఫిలింఛాంబర్ నుండి కనీసం సినిమా బాగుందనే చిన్న లెటర్ కూడా రాలేదని తన బాధను వ్యక్తం చేశాడు. మరి దీనికి ఆయనకి ఎటువంటి సమాధానం వస్తుందో చూడాలి..