తెగించిన సెన్సార్ లేడీ...!

September 25, 2015 | 05:08 PM | 7 Views
ప్రింట్ కామెంట్
sensor_board_member_attack_producer_niharonline

ఏ విధంగా దాడి చేస్తే ఆ నిర్మాతకు గాయాలయ్యాయనే విషయంలో సరైన వివరణ ఏమీ ఇవ్వలేదు గానీ, ఒక సెన్సార్ లేడీ ఓ నిర్మాతను గాయపరిచిందనే వార్తలు వెలుగులోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో సెన్సార్ బోర్డు వారిపై వివాదా స్పద వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. అయితే జరిగిందేమిటనేది తెలియక పోయినా తెలుగు సినీ నిర్మాత శరత్‌కుమార్‌పై ప్రాంతీయ సినిమా సెన్సార్ బోర్డు సభ్యురాలు మంగారెడ్డి దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడిలో శరత్‌కుమార్ తలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఆ నిర్మాతను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారట. మంగారెడ్డిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో శరత్ కుమార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. ఈ దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ మధ్యే ఓ అధికారి నిర్మాత నుండి లంచం డిమాండ్ చేస్తూ సీబీఐకి అడ్డంగా దొరికి పోయారు. తాజాగా దాడి ఘటన చోటు చేసుకోవడంతో సినీ వర్గాలు ఆశ్చర్య పోతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ