బర్త్ డే స్పెషల్ : బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ @50

November 02, 2015 | 03:11 PM | 3 Views
ప్రింట్ కామెంట్
sharukh-khan-50-th-birthday-special-niharonline

ఒక్క ఛాలెంజ్ వ్యక్తి జీవితాన్ని మార్చేస్తుందనటానికి నిదర్శనమతడు. నటుడు కావాలన్న ఆశయంతో వచ్చాడు, ఛీ కొట్టించుకున్నాడు. వీడు నటుడేంట్రా అంటూ ఓపెన్ గా కామెంట్లు అయితేనేం అవేం పట్టించుకోలేదు. కష్టపడ్డాడు.  ప్రస్తుతం బాలీవుడ్ ను రారాజుగా ఏలుతున్నాడు.  టాలెంట్ ఉన్నోడికి బ్యాగ్రౌండ్ అక్కర్లేదు... బుర్రలో గ్రౌండ్ ఉంటే చాలు. 23 ఏళ్ల నటనా కెరీర్ తో వెండితెరపై సంచలనాలు సృష్టించిన నేడు 50వ వడిలోకి అడుగుపెట్టాడు.  అతనే బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్. ఈ సందర్భంగా నీహార్ ఆన్ లైన్ ఈ కింగ్ ఖాన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

1965 నవంబర్ 2న పుట్టిన ఎస్సార్కే 70 సినిమాల్లో నటించాడు. 14 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు. 30 సార్లు అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఆయనను ప్రభుత్వం కూడా పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. . 1980 లలో  దూరదర్శన్ లోని కొన్ని సీరియల్స్ లో నటిస్తూ ఖాన్ తన వృత్తి ని ప్రారంభించాడు. 'సర్కస్' సీరియల్ తో బుల్లితెర వీక్షకులను అలరించిన షారుక్ ఖాన్ 'ఫౌజీ' సీరియల్ తో తారాపథంలో దూసుకుపోయారు. దీవానా (1992) చిత్రంతో సినీ ఆరంగ్రేటం చేశారు. ఆ తర్వాత వచ్చిన డర్ బాజీఘర్ చిత్రాలు అతనిలోని నటుడ్ని తెరపై ఆవిష్కరించాయి. సైకో ప్రేమికుడిగా, తన తండ్రిని చంపిన వ్యక్తిపై పగ సాధించే యువకుడిగా షారూఖ్ చేసిన నటనకు దేశం మొత్తం నీరాజనం పట్టింది. ఇక దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే (1995) తో షారూఖ్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. లవర్ బాయ్ గా స్థిరపడటంతోపాటు అప్పటినుంచి బ్లాక్ బస్టర్ హిట్ లు అందిస్తూ వచ్చాడు. అంతేకాదు బాద్ షా టైటిల్ తో కొనసాగుతూ వస్తున్నాడు. ఇప్పటిదాకా మొత్తం 13 ఫిల్మ్ ఫేర్ బహుమతులను గెలుచుకున్నాడు, అందులో ఏడు ఉత్తమ నటుడి వర్గానికి చెందినవి. బాలీవుడ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రేయసి గౌరీని పెళ్లిచేసుకున్నాడు షారూఖ్. వీరికి ఇద్దరు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె.  

దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే (1995), కుచ్ కుచ్ హోతా హై (1998), చక్ దే ఇండియా (2007), ఓం శాంతి ఓం (2007) మరియు రబ్ నే బనా దీ జోడీ (2008) బాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన సినిమాలుగా నిలిచిపోయాయి, కభి ఖుషి కభీ ఘం (2001), కల్ హో నా హో (2003), వీర్-జారా(2004) మరియు కభి అల్విద నా కెహనా (2006)లు విదేశీ మార్కెట్లో అధిక వసూలు చేసిన సినిమాలు, ఇవన్నీ అతనిని భారతదేశంలో విజయవంతమైన నటుడిగా చేశాయి. మధ్యలో నటి జూహీ చావ్లాతో డ్రీమ్స్ అన్‌లిమిటెడ్ బ్యానర్ ను ఆతర్వాత భార్య గౌరీఖాన్ తో కలిసి రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణసంస్థను నెలకొల్పాడు. 2008లో న్యూస్ వీక్ లో అతనిని ప్రపంచంలోని 50 మంది శక్తివంతమైన వ్యక్తులలో ఇతనిని ఒకరిగా పేర్కొంది.

ఎనర్జిటిక్ యాక్షన్ కి, ఎంటర్ టైన్ మెంట్ కి షారూఖ్ పెట్టింది పేరు. దిల్ సే, దేవదాసు, మొహబ్బతే, వీర్ జరా, చక్ దే ఇండియా, స్వదేశీ, రబ్ దే బనాదీ జోడీ లాంటి చిత్రాల్లో షారూఖ్ ఖాన్ ఎమోషన్ యాక్టింగ్ చాలు అతను ఎంతటి నటుడో చెప్పటానికి. 23 ఏళ్ల యాక్టింగ్ కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు అయినా మొక్కవోని దీక్షతో రాణించాడు.

ప్రస్తుతం తనకు అచ్చొచ్చిన పెయిర్ కాజల్, చెన్నై ఎక్స్  ప్రెస్ దర్శకుడు రోహిత్ శెట్టితో తో కలిసి దిల్ వాలే అంటూ త్వరలో సందడి చేయబోతున్నాడు. ఈవే గాక ఫ్యాన్, రాయిస్ అంటూ మరో రెండు ప్రయోగాత్మక చిత్రాలతో మన ముందుకు రానున్నాడు. ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్ టీజర్ ను విడుదల చేశాడు. బాలీవుడ్ రారాజుగా ఏలుతున్న షారూఖ్ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ నీహార్ ఆన్ లైన్ తరపున మరోక్కసారి విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్ డే .

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ