దర్శకుడిగా ఎదిగినా మేకింగ్ పైనే దృష్టి

December 31, 2014 | 05:22 PM | 37 Views
ప్రింట్ కామెంట్

ఐ సినిమాకోసం సినీ ప్రియులు ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ఆడియో ఫంక్షన్ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడారు. ఈ వేడుకకు ముఖ్యఅతిధులుగా హాజరైన త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి మరియు బోయపాటి శీనులు దర్శకుడు శంకర్ విజ్ఞానాన్ని, క్రియేటివ్ నెస్ ని కీర్తించారు. ముఖ్యంగా రాజమౌళి ‘నేను ప్రేమికుడు సినిమా టైం లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న రోజుల్లో శంకర్ ఎలా ఆలోచించి తీస్తారు అని ఆలోచించేవాడిని, ఇప్పుడు ఐ సినిమా ట్రైలర్ చూశాక కూడా ఇంత పెద్ద దర్శకుడిని అయ్యాక కుడా అలాగే ఆలోచిస్తున్నా’ అదీ శంకర్ గొప్పతనం అని కీర్తించారు. తెలుగు వెర్షన్ కి పాటలు రాసిన రచయితలు స్టేజ్ పైన సినిమాతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. శంకర్, చియాన్ విక్రమ్ లు ఈ సినిమాకోసం తామెంత కష్టపడ్డామో కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. ఏ.ఆర్ రెహమాన్ అందించిన స్వరాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ఆడియో ఫంక్షన్లో అందరినీ ఆకట్టుకున్న అంశం సినిమా మేకింగ్ వీడియో. అసలు షాట్ ను ఎలా తీశారో అని ఆలోచిస్తుంటాం... కానీ ఇందులో ఎలా తీసింది స్పష్టంగా చూపించారు. రెహమాన్ మ్యూజిక్ కంపోజింగ్, హీరో విక్రమ్ మేకప్ యాక్షన్ పార్టులు... సినిమా ఎలా ఉన్నా ఈ క్లిప్పింగ్సే చాలా ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ