షారూఖ్ విలనీ గెటప్ అదుర్స్....

July 17, 2015 | 12:23 PM | 4 Views
ప్రింట్ కామెంట్
sharukh_raees_teaser_niharonline

బాలీవుడ్ బాద్ షా సినిమాలు ఇప్పుడు విరుసగా మూడు రెడీ అవుతున్నాయి. ఆయన ‘ఫ్యాన్’, ‘దిల్వాలే’, ‘రయీస్’ చిత్రాల షూటింగుల్లో బిజీ అయిపోయాడు. అన్ని సినిమాలూ  షూటింగ్ చాలా స్పీడ్ గా జరుపుకుంటున్నాయి. ఈ మూడు చిత్రాల్లో ‘దిల్వాలే’ ఈ ఏడాది డిసెంబర్ 18వ తేదీ విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇంతవరకు పోస్టర్లుగానీ, టీజర్‌గానీ విడుదల కాలేదు. ‘ఫ్యాన్’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ‘టీజర్’కి అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇక మూడో చిత్రమైన ‘రయీస్’ని వచ్చే ఏడాది ‘ఈద్’ సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ వేశారు. అంటే ఈ సినిమా కోసం మరో సంవత్సరం ఆగాలన్నమాట. అయితే ఈ చిత్రంలో చాలాకాలం తర్వాత షారుఖ్ నెగెటివ్ పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ‘టీజర్’ తాజాగా విడుదలైంది. ‘ఏ వ్యాపారం చిన్నది కాదు.. వ్యాపారానికి మించి ధర్మం ఏదీలేదు’ అన్న డైలాగుతో మొదలయ్యే ఈ టీజర్‌లో షారుఖ్ ఎంట్రీ సూపర్ అనిపించేలా వుంది. అంతేకాదు.. గత సినిమాలతో పోల్చుకుంటే ఇందులో షారుఖ్ సరికొత్త గా కనిపిస్తున్నాడు. నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. అతని ఎంట్రీనే చాలా వెరైటీగా, ఓ క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా ఉంది. తమ అభిమాన హీరోలను కొత్త కొత్తగా చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ టీజర్ సినిమా కోసం ఎదురు చూడదగిన ఉత్సాహాన్ని రేపింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ