సోషల్ నెట్ వర్క్ ల పుణ్యమా అని ప్రముఖులంతా నేరుగా ప్రజల్లోకి వెళ్ళ గలుగుతున్నారిప్పుడు. స్టార్లు అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు, వారి మనోభావాలు, వారి దిన చర్యలు ట్విట్టర్లో పోస్టు చేస్తుంటే... అభిమానులకు పండగే పండగ. ఇటీవల బాలీవుడ్ ఖాన్ లు ట్విట్టర్లో తమ ఫొటోలను పోస్టు చేసి అభిమానులను అలరించారు. ఖాన్ ల త్రమయంలో ఇద్దరు తమ లేటెస్ట్ ఫోటోలను ట్వీట్ చేశారు. సల్మాన్‌ఖాన్ అతి సామాన్యుడిలా రోడ్డు మీద సైకిల్ తొక్కుతూ తీయించుకున్న ఫోటోను ట్వీట్ చేస్తే, షారుఖ్‌ఖాన్ తన ముద్దుల చిన్నకుమారుడు అబ్రామ్, ఇంట్లో ఓ చీపురు పట్టుకుని పోజిచ్చిన ఫొటోను ట్వీట్ చేశాడు. దానికి కామెంట్ కూడా ఇచ్చాడు... ’వామ్మో..వీడుకూడా స్వచ్ఛభారత్ ఉద్యమానికి రెడీ అవుతున్నాడు’ అని సరదాగా రాసుకున్నాడు ట్విట్టర్లో.