‘ఐ’ సినిమాకు సంబంధించిన వివాదాలు ఇంకా సమసిపోకముందే శంకర్ అజిత్ తో ఓ సినిమా చేయడానికి సిద్ధమైనట్టు వార్తలు వచ్చేసాయి. ‘ఐ’ సినిమాకు కొద్దిగా విమర్శలు ఎదుర్కొన్న శంకర్ తదుపరి ప్రాజెక్ట్ ను కొత్త కథాంశంతో జవాబు చెబుతాడనే నమ్మకాన్ని అభిమానులు వెలిబుచ్చుతున్నారు. ఇందుకు ఇతనికి తోడుగా తమిళ స్టార్ హీరో అజిత్ కూడా నిలవనున్నాడని సమాచారం! అంటే.. త్వరలోనే ఈ ఇద్దరూ కలిసి ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయనీ, సబ్జెక్ట్ వర్క్ కూడా జరుగుతోందనీ అంటున్నారు. కొన్నిరోజుల అనంతరం అధికారికంగా ప్రకటన విడుదల చేస్తారని యూనిట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ కు ఎ.ఎం.రత్నం తోడవుతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.