అప్పట్లో సంచలన విజయం సాదించిన 7 జి బృందావన కాలనీ (తమిళ్ 7జి రైన్ బో కాలనీ) చిత్రం లో హీరోయిన్ గా నటించి మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు ఆకట్టుకుంది సోనియా అగర్వాల్ . ఆ తరువాత ఆ సినిమా దర్శకుడు సెల్వ రాఘవన్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది. నాలుగేళ్ళకే ఆ ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు మళ్ళీ వరుసగా సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు మరో పెళ్లి చేసుకునేందుకు సిద్దం అవుతోంది. త్వరలోనే సోనియా పెళ్లి చేసుకుంటుందని కోలీవుడ్ లో జోరుగా వార్తలు వస్తున్నాయి. మరో వైపు సెల్వ భార్యకు ఇబ్బంది లేకపోతె సెల్వరాఘవన్ సినిమాల్లో కుడా నటించేందుకు సిద్దం అని చెపుతోంది ఈమె. 35 లోకి అడుగు పెడుతున్న ఈవిడ వరుడు ఎక్కడున్నాడో వేచి చూద్దాం....