ఈ మధ్య మన సినిమాల్లో అత్తల పాత్రలకు బాగా డిమాండ్ పెరిగింది. వారిని కీలక పాత్రల్లో చూపించేస్తున్నారు. అంతేకాదు, గతంలోలా కాకుండా గ్లామరస్ గా ఉండే తారల్ని ఈ అత్త పాత్రలకు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ‘అత్తారింటికి దారేది’ లో నదియా గ్లామరస్ అత్తగా ఓ ఊపు ఊపింది. కాగా, ఇప్పుడు విషయమేంటంటే... ప్రస్తుతం కొరటాల-మహేష్ చిత్రంలో కూడా కీలకమైన ఓ అత్త పాత్ర ఉందట. దీనికి తొలుత నదియాను తీసుకోవాలని దర్శకుడు భావించాడట. అయితే ప్రీవియస్ మూవీలో ప్రభాస్ కు తల్లిగా నటించటం, అత్తారింటికి దారేది లాగా సేమ్ కాన్సెప్ట్ ఉంటుందని భావించిన దర్శకుడు మనస్సు మార్చకున్నాడంట. దీంతో మరో గ్లామరస్ తార కోసం వేట కోనసాగిస్తున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడీ క్యారెక్టర్ కోసం నిన్నటి తరం అందాల నటి శ్రీదేవిని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమెతో చిత్ర వర్గాలు సంప్రదింపులు కూడా చేస్తున్నాయంట. ఇటీవల రాఘవేంద్రరావు సౌందర్యలహారి కార్యక్రమంలో ఇప్పటి తరం నాయకులలో తన ఫేవరెట్ ఎవరు అని శ్రీదేవీని అడగగా... మహేష్ అని తడబడకుండా చెప్పేసింది. మరిప్పుడు తన ఫేవరెట్ స్టార్ కి అత్తగా నటించేందుకు శ్రీదేవి ఒప్పుకుంటుందా? లేదా ? అనేది చూడాలి.