కొరటాల శివ శ్రీమంతుడు స్టోరీ లైన్ అనుకోకుండా ఆయన మదిలో మెదిలినప్పుడే... అప్పట్లో ధనవంతులు గ్రామాల్ని దత్తత తీసుకుని బాగు చేయాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. కొరటాలకూ ఊరు-దత్తత యాదృచ్ఛికంగా మెదిలింది. గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్టు లోనే శ్రీమంతుడు తెరకెక్కించారు. ఈ సినిమా ఎఫెక్టు ఇప్పుడు రాజకీయాలపై సూటిగా పడింది. నేతలంతా ఒకరికొకరుగా ఈ సినిమా చూసొస్తున్నారు. బావుంది. ఇన్ స్పయిరింగ్ అంటూ ఊళ్లను దత్తత తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి శ్రీమంతుడు కాన్సెప్టు విపరీతంగా నచ్చేసిందట. అందుకే ఈ కాన్సెప్టును అందరిలోకి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు. ప్రతి మంత్రి 5 గ్రామాల్ని దత్తత తీసుకోవాలి. ప్రతి ఎమ్కెల్యే ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని బాగు చేయాలి.. అంటూ ఆయన మంత్రులకు ఎమ్మెల్యే లకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీలు విధిగా సొంత గ్రామాల్ని దత్తత తీసుకోవాల్సిందిగా కోరారు.
ఈ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవి పల్లి గ్రామంలో అధికారికంగా లాంచ్ చేస్తున్నారు సీఎం. అంతేకాదు అసలు తెలంగాణలో ఏ గ్రామాల్ని అభివృద్ధి చేయాల్సి ఉంది అన్న జాబితాని పరిశీలిస్తున్నారిప్పుడు. దీనికోసం మండలాధికారులు సర్పంచుల నుంచి వివరాల్ని కోరుతున్నారు. మోదీ కన్నా పవర్ ఫుల్ గా పని చేస్తోంది ఇప్పుడు శ్రీమంతుడి సినిమా. ఏ పని చేసినా ఇంత ఇన్ స్పైర్ అవ్వాలన్నది శ్రీమంతుడు సినిమా చూపిస్తుందన్నమాట.