మహేష్ సినిమా... షారూఖ్ ‘స్వదేశ్’ కాదు

July 25, 2015 | 05:36 PM | 4 Views
ప్రింట్ కామెంట్
mahesh_babu_srimanthudu_photos_niharonline

మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా ఆగస్టు 7న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కథ గురించిన చర్చల్లో మునిగిపోయారు అభిమానులు. ఈ చిత్రం విడుదల చేసిన ట్రైలర్, పాటలకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన కనిపించింది. ఈ సినిమాలో ఓ మెసేజ్ ఉందన్న విషయమూ స్పష్టమైంది. శ్రీమంతుడైన మహేష్ బాబు ఓ ఊరిని దత్తత తీసుకునే నేపథ్యంలో ఆయన జీవితంలో అనుకోని పరిణామాలు ఎదుర్కొంటాడు. ఇలాంటి కథతో సాగేదే ఈ సినిమా. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమాపై కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది హిందీలో షారూఖ్ ఖాన్ నటించిన స్వదేష్ సినిమాను పోలి ఉందని అంటున్నారు. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ యుస్ నుంచి ఇండియా వచ్చి తను తన మాతృదేశానికి ఏదైనా చేయాలని అనుకుంటాడు. అందుకోసం తన సొంత దేశానికి తిరిగి వస్తాడు.  ఈ విషయమై శ్రీమంతుడు సినిమా టీమ్ ను సంప్రదిస్తే, తమ చిత్రానికి షారూఖ్ చిత్రానికి పోలికలేమీ లేవంటున్నారు. ఇది ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ అనీ అంటున్నారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శృతి హాసన్ మహేష్ తో జతకడుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ