ప్రేమ కథా చిత్రం అంత హిట్ సుధీర్ బాబుకు లేవనే చెప్పాలి. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమా బాగుందన్న టాక్ వచ్చింది కానీ థియేటర్లలో పెద్దగా ఆడలేదు. నటుడిగా అరంగేట్రం చేసి అయిదేళ్ళు కావస్తున్నా సుధీర్ బాబు హీరోగా నిలదొక్కుకోలేదనే చెప్పాలి. క్రైమ్ కామెడీ జోనర్ బావుందని అదే ప్రయత్నించి మామగారి టైటిల్ తో ‘మోసగాళ్ళకు మోసగాడు’ చేశాడు. కానీ ఫలితం దక్కలేదు. తర్వాత వచ్చిన కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ కథ బాగుందన్నారు గానీ... ఎందుకో మరి విజయం సాధించలేకపోయింది. విజయం వరించె ఓ మంచి రోజు కోసం అదే పనిగా ఎదురుచూస్తున్న సుధీర్ తన తర్వాతి సినిమాకి 'భలే మంచి రోజు' అనే టైటిల్ పెట్టేసుకున్నాడు. ఈ సినిమాని నిర్మిస్తున్నది ఎవరో కాదు... సుధీర్ బాబు చిన్న నాటి స్నేహితులు శశి-వంశీలు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా షూటింగ్ మరో 10 రోజుల్లో పూర్తి కానుంది. ఈ సినిమాతో సుధీర్ కి మంచి రోజులు వస్తాయా లేదో ఎదురు చూడాల్సిందే. ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.