కేసీఆర్ తో ఫిల్మ్ ఇండస్ట్రీ మీటింగ్ ఆగస్టు 20న

August 06, 2015 | 01:27 PM | 2 Views
ప్రింట్ కామెంట్
KCR_meeting_tfcc_augu_20_niharonline

తెలంగాణ సినిమా పరిశ్రమ గురించి  ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకునున్నారనే విషయమై ఈనెల 20న చర్చలు జరుగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ సినిమా పెద్దలు సినిమాటో గ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి మంతనాలు జరిపారు. తెలంగాణ ఫిలింఛాంబర్ (టిఎస్ ఎఫ్ సిసి) అధ్యక్షుడు రామ్మోహన్ రావ్ ఇటీవలే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిశారు. 16 డిమాండ్లతో కూడిన ఓ ఎజెండాని సిద్ధం చేసి ఆయనకు వినిపించారు. దీనికి మంత్రిగారు పాజిటివ్ గా స్పందించడమే కాక ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసే ముందు సావధానంగా ప్రతి పాయింటును వింటానని మాటిచ్చారు. రావ్ తో పాటు దిల్ రాజు, నారాయణ నారంగ్ దాస్, సుధాకర్ రెడ్డి, ఎన్.శంకర్ వంటి ప్రముఖులు ఈ మీటింగులో పాల్గొన్నారు. 

వారి డిమాండ్లలో కొన్నిటిని పరిశీలిస్తే ... ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ లో ఓ మినీ థియేటర్ ని ప్రభుత్వం భాగస్వామ్యంతో నిర్మించాలి. 200 సీట్లతో పరిమిత స్థలంలో థియేటర్ నిర్మిస్తే సరిపోతుంది. వీటిలో చిన్న సినిమాకి పెద్ద ప్రాధాన్యత నివ్వాలి. అలాగే తెలంగాణ సినిమాకి సొంతంగా ఓ బిల్డింగ్ కావాలి. దానికోసం స్థలం కావాలి. దీనికి ఎకరా ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగానే ఉందని చెబుతున్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఫిలిం ఇనిస్టిట్యూట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలన్నది ఓ ప్రధాన డిమాండ్.  రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లో అస్సలు ఫిలిం ఫెస్టివల్స్ మాటే లేదు. అందుకే ఈసారి బాలల చలన చిత్రోత్సవాల్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిపించడానికి ప్లాన్ చేయాలన్నది ఓ ప్రపోజల్. ఇక నుంచి రెగ్యులర్ గా యేటేటా ఈ ఉత్సవాలు ఘనంగానే నిర్వహించాలన్నది ప్రతిపాదన. ఈ శ్వేతపత్రాన్ని తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తీసుకెళ్లనున్నారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ