రెగ్యులర్ షోలు మొదలవకముందే బెనిఫిట్ షోలకు వెల్లడైన ఫీడ్ బ్యాక్ ను బట్టి చూస్తే ఈ చిత్రానికి 100 కోట్ల కలెక్షన్ గ్యారంటీ అనీ, 100 కోట్లు సాధించిన సినిమాగా బాహుబలి చరిత్ర కెక్కుతుందని అంటున్నారు. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించే సినిమాగా రికార్డులుల కెక్కుతుందని చెబుతున్నారు. ఈ సినిమాకు ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. పది శాతం మాత్రం సినిమా ముగింపు నిచ్చే ఫీలింగ్ రాలేదనీ, రెండవ పార్ట్ కు కొంత సస్పెన్స్ పెట్టారంటారు. ఈ సినిమాను ఇప్పటికే అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసిన రికార్డును దక్కించుకుందనీ, కలెక్షన్ల విషయం పక్కన పెడితే, ఇక తరువాత వచ్చే రికార్డులను కూడా ఇది తిరగరాస్తుందని అంటున్నారు. పిక్చరైజేషన్, ఫోటోగ్రఫీ అద్భుతమనీ, ఒక తెలుగు సినిమాకు సంబంధించి అన్ని రికార్డులు ఈ చిత్రం చేజిక్కించుకొని నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంటుందని అభిమానులు అంటున్నారు.