కథ వినగానే వెంటనే ఒప్పేసుకున్నాననీ, ఇలాంటి కథ తో ఇంతవరకూ సినిమాలు చేయకపోవడం వల్ల ఈ పాత్ర చేయాలన్న కోరిక బాగా కలిగిందని త్రిష నాయకి హారర్ చిత్రం విషయాలను చెప్పుకొచ్చింది. నాయకి చిత్రంలో తన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పింది త్రిష. నాయకి సినిమాకోసం దర్శకుడు గోవి అద్భుతమైన కథను సిద్ధం చేశారు. ఇందులో త్రిషను కథానాయికగా ఎంపిక చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. నాయకి చిత్రం గురువారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో నా పాత్ర గెటప్, లుక్స్ 1980నాటి కాలాన్ని పోలి ఉంటాయి. అయితే పిరియాడికల్ మూవీ కాదు. ఇది ఒక కొత్త ప్రయోగం’’ అని చెపుతోంది. మరో వివేషం ఏమిటంటే ఈ చిత్రంతో త్రిష గాయనిగా మారనుంది. సినిమా తారలు తమ సినిమాల్లో ఓ పాట పడుకునే ట్రెండ్ నడుస్తోందిప్పుడు. అలా తను కూడా ఓ పాట పాడి తానూ పాటగత్తెనే అని నిరూపించుకోవాలనుకుంది త్రిష. గోవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గిరిధర్ మామిడిపల్లి నిర్మాత. గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, కోవై సరళ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ మధ్యే లక్ష్మి మంచుతో ‘యాందిరో...’ అంటూ అదిరిపోయే పాట పాడదించిన రఘు కుంచె ఈ సినిమాను సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి త్రిష తో ఎలాంటి పాట పాడిస్తాడో వేచి చూద్దాం...