మాటల గారడీ డైరెక్టర్ ఈసారి నితిన్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ టైటిల్ కూడా వెరైటీగా పెట్టేశారు. అ..ఆ... ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా రొమాంటిక్ మూవీ అంటున్నారు. అందుకే ఈ సినిమాను ప్రేమికులకు కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇటీవలే అధికారికంగా ప్రారంభమైన ఈ సినిమా అక్టోబర్ 10 నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని ఇదివరకే తెలియజేశాం. ప్రస్తుతం ఈ చిత్ర టీం ఫస్ట్ షెడ్యూల్ కోసం సిద్దమవుతున్నారు.
ఈ సినిమా రిలీజ్ అనుకున్నప్పుడు కంటిన్యూగా షూట్ చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. ఇలాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ కి ఆ డేట్ అయితేనే బాగుంటుందని ఈ చిత్ర బృందం ఆలోచిస్తోంది. నితిన్ సరసన అందాల భామ సమంతతో పాటు తమిళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా హీరోయిన్ గా కనిపించనుంది. అక్టోబర్ 10 నుంచి కంటిన్యూగా 3 నెలల పాటు షూటింగ్ జరుపి విడుదలకు సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మొదటి సారిగా తెలుగు పాటలు అందించబోతున్నారు.