విడుదలకు ముందే ‘త్రిపుర’కు బిజినెస్ ఆఫర్

August 10, 2015 | 11:24 AM | 1 Views
ప్రింట్ కామెంట్
tripura_mve_stills_niharonline

'గీతాంజలి' ఫేం రాజ కిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం త్రిపుర. ఈ చిత్రం  షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకుంది. విశేషం ఏంటంటే.. త్రిపుర విడుదలకు ముందే శాటిలైట్ హక్కులకు బేరం కుదిరిందని, ఓ ప్రముఖ ఛానెల్ త్రిపురకు భారీ ఆఫర్ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి.  ఓ పెద్ద స్టార్ చిత్రాలకు కూడా విడుదల తరువాత శాలిలైట్ హక్కులను కొనుగోలు చేస్తున్న ఈ సమయంలో త్రిపుర లాంటి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఈ తరహా భారీ ఆఫర్ రావడంపై ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.  ఈ స్టోరీ లైన్ ఆసక్తి కరంగా ఉండడంతోదీని బిజినెస్ విడుదలకు ముందే బాగా జరుగుతుందని అనుకుంటున్నారు. ఈ చిత్రవిశేషాలను నిర్మాత చినబాబు తెలియజేస్తూ - ''ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం. మేం అనుకున్న విధంగా సినిమా బాగా వచ్చింది. స్వాతి నటన హైలైట్ గా నిలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే కాకుండా మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని నిర్మించాలని ఉంది. ఇది యునివర్శల్ కథాంశంతో రూపొందిన చిత్రం కాబట్టి, ఏ భాషకైనా నప్పుతుంది'' అన్నారు.  దర్శకుడు మాట్లాడుతూ - ''నా తొలి చిత్రం 'గీతాంజలి'కన్నా ఈ చిత్రం బాగా వచ్చింది. స్వాతీ నటన, సప్తగిరి కామెడీ హైలైట్ గా నిలుస్తుం’’దని అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా ముగించుకుని ఆడియో రిలీజ్ చేసి త్వరగా తెరమీదకు తెచ్చేందుకు ఈ చిత్ర  యూనిట్ ప్రయత్నిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ