బాహుబలి సినిమా అన్ని భాషల్లోనూ దుమ్మురేపుతోంది... ఈ సినిమా కలెక్షన్ల విషయం పక్కన పెడితే, దీన్ని ఉపయోగించుకొని బిజినెస్ చేద్దామనుకునే వాళ్ళూ ఉన్నారు. అలా త్రిష, నయనతార ఎంటరై పోయారనుకుంటున్నారా? కాదు... కాదు ఈ సినిమాను తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు అయినటువంటి స్టూడియో గ్రీన్ మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేసాయి. తమిళంలో ‘బాహుబలి’ చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్లలో ‘త్రిష ఇల్లా నా నయనతార’(త్రిష లేదంటే నయనతార) చిత్ర ట్రైలర్ హల్చల్ చేస్తుంది. ఇదన్న మాట త్రిష, నయనతారలకు ఉన్న సంబంధం. ‘బాహుబలి’ చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్లలో ఇంటర్వెల్ సమయంలో ‘త్రిష ఇల్లానా నయనతార’ చిత్ర ట్రైలర్ ను ప్రదర్శిస్తున్నారు. ఈ విధంగా తెలుగు సినిమాల్లో జేమ్స్ బాండ్ ఎంటరై పోతున్నాడు. అలా హిందీలో అయితే బ్రదర్ సినిమాల కరిష్మా చిందులేస్తోంది. ఇక తమిళంలో ‘త్రిష ఇల్లా నా నయనతార’. గమ్మత్తేమిటంటే ఇందులో త్రిష నయనతార ఇద్దరూ ఉండరు. ప్రముఖ సంగీత దర్శకుడు జివి.ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలయ్యింది. ఆనంది, మనీషాయాదవ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్నిజయకుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో సిమ్రాన్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇటీవలే ఆడియో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ‘బాహుబలి’ సినిమా ప్రదర్శించే థియేటర్లలో తమ చిత్ర ట్రైలర్ ను ప్రదర్శించడానికి అవకాశం కల్పించినందుకు నిర్మాత కె.ఈ.జ్ఞానవేల్ రాజాకు ‘త్రిష ఇల్లానా నయనతార’ చిత్ర నిర్మాతలు కృతజ్ఞతలు తెలియజేసారు. తమిళంలో కూడా ‘బాహుబలి’ దుమ్మురేపుతోంది. అన్నిచోట్ల కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లతో భీభత్సం సృష్టిస్తుంది. మొత్తానికి తెలుగులోనే కాకుండా అన్ని భాషలలో కూడా ‘బాహుబలి’ భారీగా దాడి చేస్తుంది.