బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం `సన్నాఫ్ సత్యమూర్తి`(ఇంకా కన్ఫం కాలేదు). ఈ సినిమా లో సమంత, నిత్యామీనన్, ఆదా శర్మలు హీరోయిన్స్ గా చేస్తున్నారు. అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ ముందుగా ఇచ్చిన బడ్జెట్ కంటే ఎక్కువుగానే ఖర్చు పెట్టిస్తున్నారట. గతంలో ఖలేజ, అతడు సినిమాలకు కూడా త్రివిక్రమ్ ఎక్కువుగా ఖర్చు పెట్టించారనే విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కామెడియన్ ఎమ్మెస్ తో సగానికి పైగా షూట్ చేశారట. ఆయన రోల్ కొంత పెండింగ్ ఉంది. ఆయన మరణించడంతో డైరెక్టర్ మళ్ళీ ఆయన ప్లేస్ లో ఎవరిని తీసుకోవాలనే విషయమై ఆలోచనలో పడ్డారు. షూట్ చేసినంత వరకు ఉంచాల..లేక ఎమ్మెస్ ప్లేస్ లో మరొ కొత్త ఆర్టిస్ట్ తో ఆ ట్రాక్ అంతా రీ షూట్ పెట్టుకోవాలా అనే డైలామాలో పడ్డారట. అసలే బడ్జెట్ ఓవర్ అయ్యిందనే టాక్ వినిపిస్తున్న సమయంలో త్రివిక్రమ్ ఇది మరింత సమస్యగామారింది.