భారీ బడ్జెట్ తో వివిధ భాషల్లో ఏక కాలంలో నిర్మితమవుతున్న ‘బాహుబలి’ సినిమా వ్యాపారం కూడా చాలా భారీగానే జరుగుతోంది. ఈ సినిమా ముగింపు దశకు చేరుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మధ్య కాలంలో ఈ రకమైన పౌరాణిక చిత్రాలు చూడని ఆడియన్స్ కు దర్శకధీరుడు రాజమౌళి అందిస్తున్న ఆణిముత్యంగా భావిస్తున్నారు. అయితే ఈ సినిమా అంచనాలకు తగినట్టుగానే భారీ మొత్తాల్లోనూ బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమా తమిళ హక్కుల్ని యూవీ క్రియేషన్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈ సంస్థ తమిళనాడుకు చెందిన స్టూడియో గ్రీన్ సంస్థతో పొత్తు కుదుర్చుకుని ఈ హక్కుల్ని కొనుగోలు చేసింది. సుమారుగా 25 కోట్లకు అమ్ముడయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ స్నేహితుడిది కావడంతో ఈ హక్కుల్లో ప్రభాస్ భాగం కూడా ఉండవచ్చునని కొందరు ఊహాగానాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ విషయమై హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. రెమ్యునరేషన్ లేకుండా ప్రభాస్ ఇలా హక్కుల రూపంలో తీసుకుని ఉండవచ్చునని కూడా అనుకుంటున్నారు.