‘దశావతారం’, ‘విశ్వరూపం’ వంటి మెస్మరైజింగ్ చిత్రాల తర్వాత కమల్ హాసన్ చేసిన మరో విలక్షణమైన చిత్రం ‘ఉత్తమవిలన్’. తిరుపతి బ్రదర్స్ ఫిల్మ్ మీడియా ప్రై.లి., రాజ్‌కమల్ పిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్స్‌పై ఈరోస్ ఇంటర్నేషనల్ సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్ ప్రై.లి.బ్యానర్‌పై సి.కళ్యాణ్ అందించారు. రమేష్ అరవింద్ దర్శకుడు. ఈ సినిమా మే 2న వరల్డ్‌వైడ్‌గా విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో...
సి.కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘సినిమా విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. రెండో రోజు కూడా మార్నింగ్, మ్యాట్నీ షోస్ పడలేదు. ఫస్ట్‌షోతో సినిమా స్టార్ట్ అయింది. అయితే సినిమా విడుదలకు తమిళ నిర్మాతల మండలి, సౌత్ ఇండియన్ ఫిలింఛాంబర్‌వారు, నడిగర్ సంఘం శరత్‌కుమార్‌గారు అందరూ తమ వంతుగా సపోర్ట్ చేయడంతో సినిమా విడుదలైంది. నా బ్యానర్‌లో ఇప్పటి వరకు ఇలా సినిమాలు డిలే కాలేదు. చిరంజీవి, పవన్‌కళ్యాణ్Ñ ఎన్టీఆర్ చిత్రాలను ఎంత క్రేజ్‌తో ప్రేక్షకులు ఎదురుచూస్తారో అదేవిధంగా ఎదురుచూశారు. సినిమా ఎక్స్‌పెక్టెషన్స్‌ను సినిమా అందుకుంది. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమాలో మంచి హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయి. ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచేవిధంగా స్క్రీన్‌ప్లే ఉంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇటువంటి డిఫరెంట్ అటెంప్ట్ చేయడం కమల్‌గారి గొప్పతనం.ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.
బి.ఎ.రాజు మాట్లాడుతూ ‘‘కమల్‌హాసన్‌గారి పెర్‌ఫార్మెన్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొడుకుతో క్రికెట్ ఆడే సన్నివేశం, క్లయిమాక్స్ ఇలా చాలా హార్ట్ టచింగ్ సీన్స్‌తో సినిమా రన్ అవుతుంది. సెకండాఫ్‌కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఆడియెన్స్ దగ్గర నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. కళ్యాణ్‌గారికి మరో సక్సెస్ లభించింది’’ అన్నారు.
కుమార్ బాబు మాట్లాడుతూ ‘‘సినిమా లేట్‌గా విడుదలవుతుందనే బాధ ఉన్నప్పటకీ సినిమా చూసిన తర్వాత ఆ బాధంతా పోయింది. థియేటర్స్ హౌస్‌ఫుల్ అయ్యాయి. ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. కమల్‌హాసన్‌గారి పెర్‌ఫార్మెన్స్ హైలైట్. చాలా హార్ట్‌టచింగ్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఎంటైర్ ఫ్యామిలీ కలిసి చూసే చిత్రం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సి.వి.రావు పాల్గొన్నారు.