శ్రీమంతుడు సినిమా గురించి వర్మ చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. శ్రీమంతుడు సింపుల్ అండ్ ప్లేన్ మూవీ అని పొగిడాడు. ఓ భారీ సినిమా బాహుబలి తరువాత ఇలాంటి సినిమా రావడం సింప్లిసిటీతో మనసుకు హత్తుకుందని, అద్భుతంగా ఉందని వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అప్పుడు బాహుబలిని పొగుడుతూనే మళ్ళీ ఇప్పుడు ‘‘వందల కోట్లతో వందలాది రోజులు షూటింగ్ చేస్తేనే సినిమా కాదని, సింపుల్ స్టోరీ, ప్లెయిన్ క్లోజప్స్ తో కూడా మాయ చేయవచ్చని ఈ చిత్రం రుజువు చేసింద’’న్నాడు. అంటే ఒక విధంగా ‘బాహుబలి' ని విమర్శించినట్టుగా వర్మ రాతలు నిరూపిస్తున్నాయి. చార్మింగ్ ఉన్న నటుడు క్లోజప్‌తో నటిస్తే... అంతకంటే అద్భుతమైన విజువల్స్ ఏమీ ఉండదని మహేష్ అందాన్ని పొగిడేశాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విటోరియో స్టొరారో చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు. మహేష్‌బాబు ఇందుకు చక్కటి ఉదాహరణగా వర్ణించాడు. ఇక వర్మ ఉద్దేశమేంటో ఎవరిని ఎప్పుడు పొగుడుతాడో? ఎవరిని ఎప్పుడు విమర్శిస్తాడో తెలియక తికమకపడుతున్నారు నెటిజన్లు.