వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదాస్పద ప్రయోగానికి తెరలేపాడు. సెన్సార్ బోర్డు ఉనికిపైనే ప్రశ్నలు లేవనెత్తిన వర్మ దానితో సంబంధం లేకుండా సినిమాలు విడుదల చేయటానికి సిద్ధమైపోతున్నాడు. ఇందుకోసం వెండితెర కాకుండా తన చిత్రాలను ఆర్జీవి టాకీస్ పేరుతో యూట్యూబ్ లో నేరుగా సినిమాలను విడుదల చేయనున్నాడు. తాజాగా వర్మ ‘సింగిల్ ఎక్స్’ అనే షార్ట్ ఫిల్మ్ ని విడుదల చేయనున్నట్లు వర్మ తెలిపాడు. ఇక తన యూట్యూబ్ ఛానల్ లో నా చిత్రాలనే కాకుండా నా అభిరుచికి తగ్గట్టుగా ఏ సినిమాలు నా ఛానల్ ద్వారా విడుదల అవుతాయని వర్మ తెలిపాడు. ఇన్నర్ వేర్ తో ఉన్న అమ్మాయి హాట్ ఫోజును ఈ సందర్భంగా వర్మ రిలీజ్ చేశాడు. చూస్తుంటే ఆ సినిమాతో వర్మ హీటెక్కించటం ఖాయంగా కనిపిస్తుంది.
ఈ సందర్భంగా వర్మ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘యూట్యూబ్ లో చిత్రాలను విడుదల చేయడానికి సెన్సార్ బోర్డు యొక్క అనుమతి అవసరం లేదని, తనకి నచ్చినట్లుగా సినిమాలను చేసి విడుదల చేస్తానని వర్మ తెలిపాడు. ఇక నుండి దేవుడిపై నాకు ఇష్టమొచ్చినట్లుగా సినిమాలను తీస్తానని, ఎందుకంటే నేను దేవుడిని నమ్మనని’ తెలిపాడు. ఇక ఆర్జీవి టాకీస్ లో కేవలం ఎరోటిక్, క్రైమ్, హారర్ కి సంబంధించిన సినిమాలు మాత్రమే విడుదలవుతాయని స్పోర్ట్స్ కి సంబంధించిన సినిమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయనని, తనకి స్పోర్ట్స్ అంటేనే అసహ్యం అని వర్మ తెలిపాడు. ఇక తాను లవ్, సెక్స్ అనే విషయాలను చాలా సీరియస్ గా తీసుకుంటానని కాబట్టి లవ్ కామెడీ, సెక్స్ కామెడీ చిత్రాలను కూడా ఎట్టి పరిస్థితుల్లోను విడుదల చేయనని తెలిపాడు. అయితే తన మొదటి షార్ట్ ఫిలిం సింగిల్ ఎక్స్ చిత్రాన్ని సెన్సార్ బోర్డుకి పంపాలనే ఆలోచనలో ఉన్నట్లు వర్మ తెలిపాడు. మాములుగాగానే తన సినిమాలో అవసరం లేని రసికత్వం చూపుతాడు. మరి సెన్సార్ తో సంబంధంలేని చోటు ఉరికే ఉంటాడంటారా? వర్మకి ఇక అడ్డేలేదు.