సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ ఇక లేరు

July 14, 2015 | 10:47 AM | 3 Views
ప్రింట్ కామెంట్
ms_vishwanathan_passed_away_niharonline

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథన్‌ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1928వ సంవత్సరం జూన్‌ 24న కేరళలోని పాలక్కాడ్‌ సమీపంలోని ఇలప్పులలో జన్మించారు. 13 ఏళ్ల వయసులోనే సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. సీఆర్‌ సుబ్బరామన్‌తో కలిసి దేవదాసు, లైలామజ్నూ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. దేవదాసు సినిమాలోని జగమే మాయ బతుకే మాయ పాటను స్వరపర్చారు. చండీరాణి, సిపాయి చెన్నయ్య తదితర చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఈయన మృతి వార్త విని సినీ ప్రపంచం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కొరుకుంటూ నీహార్ ఆన్ లైన్ నివాళులర్పిస్తుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ