'విశ్వ‌రూపం 2' మళ్లీ వెన‌క్కి..

March 14, 2015 | 05:27 PM | 39 Views
ప్రింట్ కామెంట్
vishwaroopam_2_niharonline

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ రూపొందిస్తోన్న చిత్రం విశ్వ‌రూపం 2. క‌మ‌ల్ రూపొందించిన 'విశ్వ‌రూపం' చిత్రం పెద్ద స‌క్సెస్ అయింది. అయితే ఆ సినిమా విడుద‌ల‌కు ముందు, విడుద‌ల త‌ర్వాత చాలా పెద్ద స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంది. విడుద‌లైన త‌ర్వాత పెద్ద విజ‌యం సాధించ‌డంతో వివాదాలు స‌ద్దుమ‌ణిగాయి. అయితే అప్ప‌టి నుండే 'విశ్వ‌రూపం 2' విడుద‌ల‌వుతుందని వార్త‌లు వినిపిస్తూ వ‌చ్చాయి. అయితే విడుద‌ల్లో జాప్యం జ‌రుగుతూ వ‌చ్చింది. ఈ వేసవిలో సినిమాని విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు వినిపించినా తాజా స‌మాచారం ప్ర‌కారం ఈసినిమాని జూన్‌లో విడుద‌ల చేయాల‌నే యోచ‌న‌లో యూనిట్ ఉంద‌ట‌. ప్ర‌స్తుతం క‌మ‌ల్ 'ఉత్త‌మవిల‌న్‌'ను విడుద‌ల చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. త‌ర్వాత 'దృశ్యం' రీమేక్ 'పాప‌నాశం' విడుద‌ల చేస్తార‌ట‌. త‌ర్వాతే విశ్వ‌రూపం 2 ఉంటుంద‌ట‌. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ