సూపర్ స్టార్ అయినా డోంట్ కేర్!

January 13, 2016 | 11:24 AM | 2 Views
ప్రింట్ కామెంట్
balakrishna-about-rajinikanth-suhasini-incident-niharonline

పెద్ద పెద్ద విషయాలతో పోలిస్తే, చిన్న చిన్న విషయాలకే తనకు కోపం వస్తుందని చెబుతున్నారు నందమూరి బాలకృష్ణ. డిక్టేటర్ చిత్రం విడుదల సందర్భంగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 'క్రీమ్ ఆఫ్ ఎయిటీస్' పేరిట చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మోహన్ లాల్, రజనీకాంత్ తదితర దక్షిణాది తారలంతా ఏడాదికి ఒకసారి కలసి సరదాగా గడిపే విషయం తెలిసిందే. అలా ఓసారి జరిగిన ఓ ఘటనను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.

                వారంతా కలిసి గ్రూప్ ఫోటో దిగుతున్నారంట. ఆ టైంలో సుహాసిని మణిరత్నం బాలయ్యతో "రజనీ సార్ వచ్చారంట... బాలా! కిందకు వచ్చేయ్" అందట. వెంటనే ఆ మాటలు మండిపోయిన బాలయ్య "రజనీ సారేంటి? ఎవడు సూపర్ స్టార్... ముందు ఫోటోలు తీయండి" అని సుహాసినిపై అంతెత్తున లేచారట. అన్నింటా పర్ఫెక్ట్ ను కోరుకుంటానని, చుట్టూ ఉన్న వాళ్లూ అలాగే ఉండాలని అనుకుంటానని, లేకుంటే మాత్రం ఆగ్రహం వచ్చేస్తుందని ఆయన నవ్వుతూ చెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ