బాలీవుడ్‌సెక్సీబ్యూటీ మల్లికా షెరావత్ లేటెస్ట్ మూవీ ‘డర్టీ పాలిటిక్స్’. రీసెంట్‌గా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. నెటిజన్ల నుంచి మాంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా గురించి హీరోయిన్ మల్లిక ఓ విషయం బయటపెట్టింది. నటుడు ఓంపురితో కలిసి కొన్ని హాట్ సన్నివేశాల్లో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది. ఐతే, బోల్డ్ సీన్స్ చేయడానికి తనకు ఏమాత్రం సౌకర్యంగా లేదని, ఆ నటుడు తనను కన్విన్స్ చేశారని చెప్పుకొచ్చింది. స్టోరీ విషయానికొస్తే.. రాజస్థాన్‌లో సంచలనం సృష్టించిన నర్స్ భన్వరిదేవిపై అత్యాచారం, హత్య వంటి నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కె.సి.బొకాడియా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రాజకీయ నాయకుడిగా ఓంపురి కనిపిస్తున్నాడు. ఇంకా నసీరుద్దీన్‌షా, అనుపమ్‌ఖేర్, జాకీష్రాఫ్, అశుతోష్ రాణా, రాజ్‌పాల్ యాదవ్ వంటి నటులు ముఖ్యమైన రోల్స్ చేస్తున్నారు. ట్రైలర్‌లో కాస్త హాట్ సీన్స్ దర్శనమీయడంతో సినిమా ఇంకా ఏ రేంజ్‌లో వుంటుందోనంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.