ఆహుతి ప్రసాద్ జబ్బేంటి?

December 20, 2014 | 04:42 PM | 28 Views
ప్రింట్ కామెంట్

‘ఆహుతి’ సినిమాలో విలన్ ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన ఆహుతి ప్రసాద్ గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు అనారోగ్యమే అని తెలిసిందే తప్ప అసలు జబ్బేమిటి? అనేది ఇంత వరకూ తెలియరాలేదు. అయితే ప్రసాద్ ను ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి పీడిస్తోందని పలువురు సన్నిహితులు తెలిపారు. ఈ విషయమై కుటుంబ సభ్యుల నుంచి సరైన సమాచారం అందలేదు. క్యాన్సర్ కు చికిత్స తీసుకునేందుకే ఆయన ఆస్పత్రిలో చేరినట్లు సన్నిహితులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స అందుబాటులో ఉండటంతో పాటు, ప్రసాద్ ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని తెలుస్తోంది. తండ్రి, స్నేహితుడు, పోలీసాఫీసర్ వంటి ఎలాంటి పాత్రలకైనా చక్కగా ఇమిడిపోయే టాలెంట్ ఉన్న ప్రసాద్ కృష్ణా జిల్లాకు చెందిన వాడు. ఈయన అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన్ వర ప్రసాద్. నాగార్జున హీరోగా నటించిన ‘విక్రమ్’ సినిమాతో ఇండస్ర్టీలోకి అడుగు పెట్టి అనేక క్యారెక్టర్లు చేశారు. ‘మల్లె మొగ్గలు’ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. శ్యాం ప్రసాద్ రెడ్డి సినిమా ‘ఆహుతి’తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అనే సినిమాకు 2003లో ఉత్తమ విలన్ గా, ‘చందమామ’ సినిమాకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెండు సార్లు నంది అవార్డులు అందుకున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడి తిరిగి ఆయన నటనతో అందరినీ అలరించాలని కోరుకుందాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ