భూమి గుండ్రంగా ఉన్నట్టే జీవితం కూడా ఓ చట్రంలా తిరుగుతుందన్నట్టు అంటున్నాడు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్. అతనిప్పుడు నాసిక్ లోని త్రయంబకేశ్వర్ కు ‘ఆల్ ఈజ్ వెల్’ షూటింగ్ నిమిత్తం వెళ్ళాడట. అది కూడా ఎక్కడి వరకూ అంటే ఐశ్వర్యకు భర్త అయిన తరువాత ఐశ్వర్యారాయ్ పాయింట్ గా పిలువ బడుతున్న ప్రదేశానికి. అభిషేక్ బచ్చన్ తన అఫీషియల్ ఫేస్ బుక్ లో ఈ విషయాలను పోస్ట్ చేశాడు. ‘జీవితం ఓ చట్రంలో ఇమిడిపోయి ఉంది. నేను షూటింగ్ చేసిన ప్రదేశం పేరు ఐశ్వర్యా పాయింట్... అవును మీరు చదువుతున్నది నిజమే... ఈ ప్రదేశంలో 12 ఏళ్ళ క్రితం ఐశ్వర్య ‘ఖాకీ’ అనే షూటింగ్ కోసం వచ్చింది. ఇదే స్పాట్ లో ఆమెకు బస్ యాక్సిడెంట్ జరిగింది. దేవుడి దయ వల్ల ఆమె ఆ ప్రమాదం నుంచి బయట పడింది. అదే స్పాట్ లో నేను ఓ ట్రక్ ను కార్ తో ఛేజ్ చేస్తున్నాను’’ అని షూటింగ్ సంగతులు చెపుతూ ఆనాటి సంగతులు గుర్తు చేశారు. 12 ఏళ్ళ క్రితం ఒకరికొకరు ఏమీ కాని వారు ఇప్పుడు దంపతులయ్యారు. సంతోషమై జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు ఐశ్వర్య పేరున్న అదే స్థలంలో తను షూటింగ్ కు వెళ్ళడం యాదృచ్ఛికంగా భావిస్తూ తన భావాలను సోషల్ నెట్వర్క్ లో షేర్ చేశాడు అభిషేక్.