సుప్రసిద్ధ దివంగత సినీనటుడు 'హరనాధ్' భార్య భానుమతీదేవి (71) ఈరోజు మధ్యాన్నం 1. 30 గంటలకు చెన్నై లోని స్వగృహంలో కన్ను మూశారు . ఆమెకు ఒక కుమారుడు శ్రీనివాసరాజు ( గోకులంలో సీత,రాఘవేంద్ర చిత్రాల నిర్మాత ) ఒక కుమార్తె పద్మజ ఉన్నారు. కుమార్తె భర్త ప్రముఖ నిర్మాత జి.విజి. రాజు ('తొలిప్రేమ' నిర్మాత). భానుమతీదేవి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. చెన్నైలో నే అంత్యక్రియలు జరుగుతాయి.