సోషల్ యాక్టివిస్ట్ కం యాక్ట్రెస్ మనీషా ముచ్చట్లు

August 05, 2015 | 03:38 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Manisha_koirana_about_her_plannings_niharonline

మనీషా జీవితాన్ని జయించింది. తన జీవితంతో కొందరి జీవితాలను వెలుగు వైపుకు నడిపిస్తుంది. బాలీవుడ్ టాలీవుడ్ లలో టాప్ హీరోల సరసన నటించిన మనీషా కేన్సర్ వ్యాధికి గురైంది. అయినా ఆత్మస్థయిర్యంతో వ్యాధి నుంచి బయట పడి కేన్సర్ వ్యాధి పీడితులకు అండగా నిలిచింది.  ఒక వైపు తన సోషల్ యాక్టివిటీస్ ను విడువ కుండానే తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తున్న మనీషా సంసార జీవితాన్ని కొనసాగించాలన్న ఆశను వ్యక్తం చేసింది. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుంటానని అంటోంది. భర్త ఉండాలా? వద్దా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదంటుంది. 
‘‘ఇప్పటికి కెరీర్ లో 70 సినిమాల్లో నటించాను. రోహిత్ కౌశిక్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నా. ఇందులో అలనాటి నాయికగా కనిపిస్తాను. దీపిక నావెల్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నా’’నని చెప్పింది. అంతేకాదు త్వరలోనే యునైటెడ్ నేషన్స్ లో తన స్పీచ్ లు వినిపించడానికి వెళుతునాన్ననని కేన్సర్, నేపాల్ ఎర్త్ కేక్ ఆడపిల్లల చదువులపై మాట్లాడనున్నానని మనీషా వివరించింది.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ