డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి వాగ్ధాటి చూపించిన సాయికుమార్ నటనలోనూ అంతే పవర్ ఫుల్ క్యారెక్టర్లలో ఇమిడి పోయాడు. 30 ఏళ్ళుగా పరిశ్రమలో కొనసాగుతూ ఉన్నప్పటికీ ఓ సీనియర్ నటుడికి ఉండాల్సిన గుర్తింపు ఆయనకు దక్కలేదు. ఆయన పోలీస్ పాత్రలో నటించి, ఆయన పవర్ ఫుల్ కంఠంతో చెప్పిన పోలీస్ స్టొరీ సినిమాలోని డైలాగ్ గుర్తుకు వస్తే వళ్ళు గగుర్పొడుస్తుంది. అలాంటి పవర్ ఫుల్ నటనతో ఆకట్టుకున్న సాయి కుమార్ టాలీవుడ్ పై సంచలన వాఖ్యలు చేసాడు. ఇటివలే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయన మాట్లాడుతూ... అప్పట్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంబించినప్పుడు ఎలాంటి ఇన్ సెక్యురిటి ఫీలింగ్ ఉండేదో ... ఇప్పుడు అలాగే ఉందని అంటున్నారు. ఇక్కడ ఎవరు నాకు అవకాశాలు ఇవ్వడం లేదని అయన వాపోయారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారినా తరువాత ఎవ్వరు అవకాశాలు ఇవ్వలేదని , ఇప్పుడు కుడా నటుడిగా టర్న్ తీసుకున్న తరువాత కుడా పరిస్థితి అలాగే ఉందని అయన అంటున్నారు. ప్రస్తానం , ఎవడు , పటాస్ , పండగ చేస్కో వంటి సినిమాల్లో మంచి పాత్రల్లో నటించినా కుడా సరైన అవకాశాలు రావడం లేదని, పరిశ్రమ కొందరికే పరిమితమైపోయిట్టు మాట్లాడారు.