ఇప్పటివరకూ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మొత్తం పాతిక సినిమాల వరకూ చేసింది అమలా పాల్. 'నాన్న' చిత్రంలో నటిస్తున్నప్పుడే ఆ చిత్రదర్శకుడు విజయ్ తో ప్రేమలో పడింది. గత ఏడాది ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇటీవల తమ మొదటి పెళ్లి రోజుని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. కేరళలోని ఓ బోట్ హౌస్ లో ఈ జంట ఎంజాయ్ చేసింది. ఆ సంగతలా ఉంచితే తన భర్తతో కలిసి మాల్దీవులు వెళ్లినప్పుడు అక్కడ స్కూబా డైవింగ్ చేసిందట అమలా పాల్. ఇప్పడు మళ్ళీ అమలా పాల్ ఆ సాహసం చేసింది. ఈసారి తన భర్త విజయ్ తో కాకుండా స్నేహితులతో కలిసి వెళ్ళిందట. ఆ విహర యాత్రలో భాగంగా స్కూబా డైవింగ్ చేసింది. స్నేహితులతో కలిసి నీళ్లల్లో ఎంజాయ్ చేస్తున్న వైనాన్ని కెమెరాలో బంధించింది. అమలా సాహసాలు రిస్క్ అని కొందరంటుంటే... అమలా పాల్ మాత్రం ''ఈ క్షణాలకు సంబంధించిన జీవితాన్నే హ్యాపీనెస్ అంటారు. ఈ అడ్వంచర్ చాలా ఆనందాన్నిచ్చింది'' అని చెప్పుకుంటోంది