వాణిజ్య ప్రకటనలో మెరవనున్న నిఖిల్

January 17, 2015 | 02:56 PM | 44 Views
ప్రింట్ కామెంట్

హ్యాపీడేస్ నిఖిల్ ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ కూడా అయ్యాడు. ఈ ఎదుగుదల వెనుక అతని టాలెంట్ తో పాటు క్రుషి చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్లు ప్రముఖ స్టార్లు ఎందరో ఉన్నారు. ఇప్పుడు సినిమా ఆదాయంతో అంబాసిడర్లుగా కోట్లకు కోట్లు సంపాదించేస్తున్నారు. సంపాదన పరంగా అందరికన్నా ముందు వరుసలో మహేష్ బాబును చెప్పుకోవచ్చు. కేవలం బ్రాండ్ పబ్లిసిటీ రూపంలోనే వందల కోట్లు సంపాదించేస్తున్నాడు. అదే కోవలో రామచ్ చరణ్ ప్రఖ్యాత బ్రాండ్లకు పబ్లిసిటీ చేస్తున్నాడు. అలాగే బన్నీ కూడా వాణిజ్య ప్రకటనల్లో రోజుకోసరైనా టీవీలో కనిపిస్తుంటాడు. అదే బాటలో అఖిల్ కూడా చేరిపోయాడు. ఇప్పటికి రెండు బ్రాండ్లకు ప్రచార కర్తగా కొసాగుతున్నాడు. ప్రఖ్యాత వాచ్ కంపెనీ టైటాన్ కి బ్రాండ్ అంబాసిడర్. అలాగే మౌంటెన్ డ్యూ కు కూడా బ్రాండ్ అంబాసిడర్. ఇక వీళ్ళందరినీ పక్కన పెడితే. స్వయం శక్తితో ఎదుగుతూ వస్తున్న మరో హీరో నిఖిల్. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా పరిశ్రమలో నిలదొక్కుకున్న హీరోగా నిఖిల్ ను చెప్పుకోవచ్చు. ఆరంభమే యూక్లిడ్ అనే ప్రఖ్యాత మెన్స్ వేర్ బ్రాండ్ కంపెనీకి ప్రచారం చేస్తున్నాడు. ఈ విషయాన్ని నిఖిల్ స్వయంగా చెప్పాడు. సంక్రాంతి పర్వదినాన ఈ శుభ వార్తను ట్వీట్ చేశాడు. స్వామిరారా, కార్తికేయ చిత్రాలతో వరుసగా విజయాలు అందుకుని అదే ఊపులో ఇప్పుడు బ్రాండ్ మోడల్ గానూ పాపులర్ అవుతున్నాడు. ఇటీవలి కాలంలో స్టయిలిష్ హీరోగా రూపును కూడా మార్చుకున్నాడు. ఒక పరిణతి ఉన్న నటుడుగా కథల్ని ఎంచుకుంటూ ఈ స్థాయికి చేరుకోవడం అభినందించ దగ్గ విషయం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ