కలాం కోసం కాంచన హీరో కోటి రూపాయలు?

August 04, 2015 | 11:49 AM | 4 Views
ప్రింట్ కామెంట్
abdul_kalam_raghava_lawrence_niharonline

సినీరంగంలో కష్టపడి పైకొచ్చిన వారి స్టోరీల తెలుసుకున్నప్పుడు మనం కాస్త ఆసక్తి కలుగుతుంది. ఎంత వెనుకబడిన బ్యాగ్రౌండ్ నుంచి వస్తారో... ఓ పోజిషన్ కు వచ్చాక కూడా ఎలాంటి అహంభావం ప్రదర్శించకుండా వారి శక్తిసామర్థ్యాల మేరకు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉంటారు. అది విన్నప్పుడల్లా మనకు కాస్త సంతోషం కలుగుతుంది.  ఎందుకంటే వారు పెరిగిన వాతావరణం వారికి నేర్పిన పాఠాలే వారికి ఆ సేవాధృక్పథాన్ని అలవరుస్తుంది. ఇక అలాంటి వాతావరణం నుంచి వచ్చినవాడే కొరియోగ్రఫర్ కమ్ నటుడు రాఘవ లారెన్స్. కటిక పేదరికం నుంచి వచ్చిన ఇతగాడు ఆ తర్వాత అనాథాశ్రమాలకు దానం చెయ్యటం, పేద విద్యార్థులకు చేయూతనివ్వటం లాంటివి చేస్తూ వస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే నిన్న ఓ భారీ ప్రకటన చేశారు. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన పేరిట పేదలకు కోటి రూపాయలను సాయంగా అందిస్తున్నట్లు లారెన్స్ ప్రకటించారు. అంతేకాదు ఇకపై ప్రతీఏడు కలాం పేరిట ప్రత్యేకంగా పురస్కారాలు అందించనున్నట్లు వెల్లడించారు. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ పేరిట కొత్తగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన లారెన్స్ స్వీయ దర్శకత్వంలో ఓ రెండు చిత్రాలను నిర్మించనున్నాడు.  ఇక ఇందులో ఒకటి పటాస్ రీమేక్ ‘మొట్టశివ కెట్టశివ’. ఈ చిత్ర  భాగస్వామి అయిన వేందర్ మూవీస్ నుంచి లారెన్స్ నిన్న రూ.కోటి చెక్కును అందుకున్నారు. ఈ మొత్తాన్ని కలాం పేరిట పేదలకు సాయంగా ఇవ్వనున్నట్లు ఆయన అక్కడికక్కడే ప్రకటించారు. వంద మంది నిజాయతీ కలిగిన యువతీయువకులను ఎంపిక చేసుకుని ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అందజేసి, నిజంగా అవసరమున్న వారిని ఆదుకుంటానని ఆయన ప్రకటించారు. కలాం ను తాను ఎంతగానో ఆరాధిస్తానని, ఆయన లాగే తాను కష్టాల నుంచే పెరిగానని, అందుకే ఈ సేవా కార్యక్రమానికి పూనుకుంటున్నట్లు లారెన్స్ చెబుతున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ