తనదైన మార్క్ నటనతో కామెడికి కొత్త అర్థం చెప్పిన హీరో నటకిరిటీ డా.రాజేంద్రప్రసాద్. ఇక ఈ జనరేషన్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఆయన మా అధ్యక్ష బరిలో పోటీకి పోటీచేయనున్నారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే వెల్లడించారు. ఒక తండ్రిగా,ఒక నటుడుగా, ఒక భర్తగా వివిధ బాధ్యతలు నిర్వర్తించానని, ఇప్పుడు మూవీ అసోసియేషన్ కు సేవ చేయాలని పలువురు కోరారని అన్నారు. ప్రతి ఆర్టిస్టు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని, అందుకు అనుగుణంగా తాను పనిచేయాలని అనుకుంటున్నానని అన్నారు.ఏకగ్రీవంగా ఎన్నికవ్వాలని అభిలషిస్తున్నానని, ఒకవేళ ఎన్నికలు జరిగితే కూడా నిలబడతానని ఆయన అన్నారు. ఈ నెలాఖరున అంటే ఈ ఫిబ్రవరి 29న మా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి.