బిజెపి పార్టీలో సభ్యుడిగా చేరిన సీనియర్ నటుడు శివాజీ రాజకీయాల్లో యాక్టివ్ మెంబర్ గా సాగుతున్నాడు. ఏకంగా బిజెపి వ్యతిరేకంగానే పోరాడటం స్టార్ట్ చేశాడు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యే హోదా ఇప్పటి ఒక సంవత్సరం ముగుస్తున్నప్పటికీ ఇవ్వకపోవడంతో శివాజీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నాడు. వివిధ సందర్భాల్లో తన నిరసనను తెలియజేసిన శివాజీ ఈ నిరసనల కారణంగా అధిష్టానం దృష్టిలో చెడు అయ్యాడు. తాజాగా ప్రత్యేక హోదా కోసం గుంటూరులో నిరాహార దీక్షను ప్రారంభించాడు. రాష్ట్రంలో ఇటు తెలుగు దేశం ప్రభుత్వం, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రత్యేక హోదా పేరు చెప్పి అధికారంలోకి వచ్చాయని అయితే ఇప్పుడు రెండు ఆ సంగతిని మరచిపోయాయని అంటున్నాడు శివాజీ. గతంలో రెండు ప్రభుత్వాలకు మద్ధతుని తెలియజేసిన పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ప్రత్యేక హోదా సాధ్యమేనని, పవన్ మద్ధతుని తెలియజేయాలని శివాజీ అంటున్నాడు. మరి ఈ డిమాండ్ పై పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందిస్తాడంటారా?