తాగి రచ్చ చేయడం ఈమెకు కొత్తేం కాదట...

April 29, 2015 | 12:29 PM | 37 Views
ప్రింట్ కామెంట్
actress_urwashi_drunken_speach_in_kerala_niharonline

ఒకప్పుడు ఈ హీరోయిన్ తెలుగు డైరెక్ట్ సినిమాల్లోనూ నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. మెగా స్టార్ చిరంజీవితోనూ చిందులేసిన ఈ నటి ఇప్పుడు బార్ లో తాగి చిందులేసిందట... ప్రేక్షకులు మరచిపోకుండా తెరకు దూరం కాకుండా అడపాదడపా సీరియల్స్‌ లోనూ ఈ మధ్యే ‘జిల్’ సినిమాలో గోపిచంద్‌కు తల్లిగానూ నటించింది ఊర్వశి. ఊర్వశి అవార్డు సీనియర్ నటి శారద సొంతమైనప్పటికీ, ఈ నటికీ అవార్డులకేం తక్కువ కాదు. ఈవిడకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. అయితే ఇప్పుడు పాపం డ్రింక్ ఓవరై వార్తల్లో కెక్కేసింది. కేరళలో జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్‌కి తాగేసి.. స్టేజిపైనే రచ్చరచ్చ చేసిందట. ఎల్‌డిఎఫ్ ఆర్గనైజ్ చేసిన ఫీమేల్ లేజిస్లేటివ్ స్టాఫ్ అసోసియేషన్ సమావేశానికి గెస్ట్‌ గా హాజరయ్యిందట. కార్యక్రమానికి ఆలస్యంగా రావడమేకాదు, స్టేజ్‌పైకి తూలుతూ వెళ్ళింది. అక్కడ నోటికి ఏదొస్తే.. అది మాట్లాడేసింది. సక్సెస్ అవుతుందనుకున్న ఆ సమావేశం కాస్త డిస్టర్బ్ అయ్యింది. దీంతో ఊర్వశిపై నిర్వాహకులు చాలా కోపంగా ఉన్నారట. ఈమె మందు కొట్టడమూ, నోటికొచ్చినట్టు వాగడమూ కొత్తేం కాదట. తన విడాకుల సమయంలో కూడా ఎర్నాకులంలోని ఓ ఫ్యామిలీ కోర్టుకు తాగి వెళ్ళిందట. ప్ఛ్ ఏ పాత్రకైనా చక్కని న్యాయం చేసే ఈ నటికి ఇదేం వీక్నెస్... వేలాది మంది ఈమె అభిమానులు నొచ్చుకుంటారు కదా!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ