మీన బాల నటిగా ఎన్నో సినిమాల్లో చేసింది. బహుశా... ఐదారేళ్ళకే సినిమాల్లోకి ఎంటరైనట్టుంది. అలా కంటిన్యూ చేస్తూ... ప్రతిఘటనలో ఓ చిన్న పాత్ర ఆ తరువాత సీతారామయ్యగారి మనవరాలిగా హీరోయిన్ అయిపోయి.... పెద్ద పెద్ద స్టార్లతో తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించింది. ఈ మధ్యే ‘దృశ్యం’ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ముద్దుగా బొద్దుగా ఉన్నా... తనకు సినిమా అవకాశాలు బాగానే వచ్చాయి. ఇప్పటికీ ఇండస్ట్రీ తనను ఆహ్వానిస్తూనే ఉంది. ఇప్పుడు మీనా తన కూతురిని కూడా సినిమాల్లోకి పరిచయం చేయబోతుంది. మీనా తన ఐదేళ్ల కూతురు ‘నైనిక’ను తమిళ సినిమాతో వెండితెరకు పరిచయం చేయించబోతుంది. తమిళంలో అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో విజయ్ కూతురి పాత్రలో నైనిక నటిస్తోందట. మరి ఈ బాల నటి కూడా తల్లిలా హీరోయిన్ అయిపోతుందేమో చూద్దాం...