బిడ్డపుట్టాడన్న వార్తను ఖండించిన తాప్సీ...

June 08, 2015 | 01:04 PM | 1 Views
ప్రింట్ కామెంట్
tapsee_denied_rumours_niharonline

‘ఇదిగో తోక... అంటే అదిగో పులి’ అన్న చందంగా పుకార్లు షికారు చేస్తుంటాయి. అది సామాన్యుల విషయంలోనే జరుగుతుంటుంది. ఇక సెలబ్రిటీల గురించయితే మరీ విడ్డూరంగా గాసిప్స్ హల్ చల్ చేస్తుంటాయి. టాలీవుడ్ సొట్టబుగ్గల తాప్సీకి మగబిడ్డ పుట్టాడంటూ చాలా ఫాస్ట్ గా ఓ పుకారు సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ప్రస్తుతం తెలుగు అవకాశాలు లేక బాలీవుడ్ చెక్కేసిందీ భామ. అక్కడ ఈ అమ్మడికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. తాప్సీ గతకొద్ది కాలంగా మాథ్యూబో అనే వ్యక్తితో చాలా సన్నిహితంగా వుంటోంది. వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని వార్తలొస్తున్నాయి. ఇందులో భాగంగానే తాప్సీ-మాథ్యూబో లకు మగబిడ్డ పుట్టాడని సోషల్ మీడియాలో తెగ వార్తలొస్తున్నాయి. అంతేకాదు తాప్సీ తల్లి అయ్యిందని తెలిసి, మాథ్యూ బో బాడ్మింటన్ పోటీల నుంచి తప్పుకొని తాప్సీ, బిడ్డల కోసం తన సమయాన్ని కేటాయిస్తున్నాడంటూ వార్తలొచ్చాయి. ఈ వార్త విని ఖంగుతిన్న తాప్సీ క్లారిటీ ఇచ్చుకోక తప్పలేదు పాపం. ‘నాకు తెలియకుండానే బిడ్డ ఎలా పుడతాడని’ తాప్సీ ప్రశ్నిస్తుంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. మాథ్యూబో తాను మంచి స్నేహితులం మాత్రమేనని, అయితే బిడ్డ పుట్టింది మాథ్యూబో స్నేహితుడికి అంటూ తాప్సీ క్లారిటీ ఇచ్చేసింది. ఇటీవలే ఈ అమ్మడు ప్రారంభించిన వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ బాగానే కొనసాగుతుందట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ