నాకు నేనే పోటీ: విద్యాబాలన్

June 09, 2015 | 02:16 PM | 1 Views
ప్రింట్ కామెంట్
vidya_balan_niharonline

విద్యాబాలన్ డర్టీ సినిమాలో నటించిన తరువాతే టాప్ మోస్ట్ స్టార్ అయ్యింది. అప్పటి వరకూ ఆమె ఎన్ని చిత్రాలు చేసిన రాని గుర్తింపు డర్టీ సినిమా తో ప్రపంచానికి ఈమె పేరు తెలిసేలా చేసింది. ఇక ఈ సినిమాలో విద్యాబాలన్ చేసిన అందాల ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రముఖ సినీ నటి సిల్క్ స్మిత జీవితగాథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ను దక్కించుకుంది. ఈ చిత్రం తర్వాత విద్యాబాలన్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ‘డర్టీ పిక్చర్’ తర్వాత విద్యాబాలన్ నటించిన పలు చిత్రాలు మంచి విజయం సాధించడంతో మరిన్ని అవకాశాలు వచ్చిపడ్డాయి. అయితే  ఈమెకు ఈమధ్య వరుస అవకాశాలు వచ్చిపడుతున్నప్పటికీ తనకు స్టార్ స్టేటస్ పైన, టాప్ 1 స్థానంపైన ఆసక్తి లేదని చెబుతోంది. తనకు కేవలం ప్రేక్షకుల అభిమానమే ముఖ్యమని, వాళ్లను దృష్టిలో పెట్టుకొనే సినిమాలు చేస్తానని చెబుతోంది. ఇంకా తన సినిమాల గురించి చెబుతూ... ఏ సినిమాలోనైనా తన పాత్రకు వంద శాతం న్యాయం చేయడానికి తనవంతు కృషి తాను చేస్తానని, కాని అది కూడా పరిధి మేరకేనని చెబుతోంది. అయితే కొన్ని సినిమాలు హిట్టవుతాయి, కొన్ని ఫ్లాప్ అవుతాయి. కానీ వాటి ప్రభావం తన తరువాతి చిత్రాల మీద వుండదని అంటోంది. ఎందుకంటే సినిమా ఫెయిల్ అయినా కూడా నటిగా తాను మాత్రం ఫెయిల్ కానంటోంది. అయితే తాను ఎవరికీ పోటీ కాదని, తనకు తానే పోటీ అంటూ తన ప్రత్యేకత గురించి చెప్పుకుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ