ఇటీవల ప్రతి చిన్న విషయాన్నీ ప్రధాన మంత్రి లాంటి పెద్ద వాళ్ళ నుంచీ... తన అభిమానాన్ని, సమస్యలూ తెలుపుకునే సామాన్య జనం వరకూ సోషల్ నెట్వర్కింగ్ ఎకౌంట్ ఓపెన్ చేయక తప్పడం లేదు. మరి విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ ఓపెన్ చేయకపోతే అభిమానులు ఊరుకుంటారా? తనకు ఈ ఓపెన్ చాటింగులు పెద్దగా నచ్చక పోయినా, అభిమానుల కోసం తప్ప లేదంటోంది. అందుకే తనూ ఓపెన్ చేసేసింది. తను ఇప్పుడు జాజ్బా అనే ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమా రిలీజ్ కు ఒక రోజు ముందు తన ట్విట్టర్ ఎకౌంట్ ఓపెన్ చేయడానికి ముహూర్తంగా పెట్టుకుంది. ఈ సినిమాకు పోస్టర్లు, ట్రైలర్ల ద్వారా ఇప్పటికే మంచి క్రేజ్ వచ్చింది. అయితే జాజ్బా సినిమా గురించిన అభిప్రాయాలను నేరుగా ప్రేక్షకుల నుంచి తెలుసుకునేందుకు తన ట్విట్టర్ లోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకుందట. అంతకు ముందు అభిమానులు ఎంతగా వేడుకున్నా ట్విట్టర్ కు నో చెప్పిన ఐశ్వర్య ఇక తన సినిమా రీ ఎంట్రీ తో ఓపెన్ చేయక తప్పలేదు పాపం.