’నేను తొలిసారి హీరోగా నటించిన చిత్రం షూటింగ్ జరుపుకున్నందుకు ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటాను' అని 'ఆంధ్రాపోరి' హీరో ఆకాష్ పూరి అన్నారు. 'నాన్నగారి ప్రోత్సాహంతోనే సినిమాల్లో నటిస్తున్నాను. నా చిత్రం ఆంధ్రాపోరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది. మూడు సంవత్సరాల పాటు విదేశాలలో నటనపై శిక్షిణ పొందిన అనంతరం మళ్ళీ సినిమాలలో నటిస్తా’ నని అన్నాడు.
ఆంధ్రాపోరి చిత్రం యూనిట్ మంగళవారం పాల్వంచలో వచ్చిన సందర్భంగా ఆకాష్ పాల్వంచ వాసులను ఉద్దేశించి ప్రసంగించాడు. ఎల్వి. ప్రసాద్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్ర హీరో ఆకాశ్పూరితోపాటు నిర్మాత మహేష్, సంగీత దర్శకులు ప్రవీణ్ వనమాల, పాటల రచయిత జోశ్య భట్ల బృందం మంగళవారం నవభారత్ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని, పెద్దమ్మతల్లి ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆంధ్రాపోరి చిత్రం ప్రదర్శిస్తున్న శాంతి థియేటర్‌కు చేరుకున్నారు. ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూశారు. థియేటర్ స్క్రీన్ వద్దకు వెళ్లిన ఆకాశ్‌పూరి ప్రేక్షకులతో మాట్లాడారు. వారి కోరిక మేరకు డ్యాన్స్ చేశారు. చిత్ర నిర్మాత మహేష్ మాట్లాడుతూ ఆంధ్రాపోరికి సీక్వెల్ తీయనున్నట్లు తెలిపారు.