అక్కినేని ఫామిలీ ఆ తరం నుంచి ఈ తరం వరకూ కుటుంబానికి చాలా ప్రాముఖ్యత నివ్వడం కుటుంబ పెద్ద స్వర్గీయ అక్కినేని నాగేశ్వర్ రావుకే దక్కుతుంది. ఎంత బిజీగా ఉన్నా... వీరు కొన్ని ప్రత్యేక అకేషన్లను కుటుంబంతో జరుపుకుంటారనడానికి ఈ సెల్ఫీనే నిదర్శనం. అఖిల్ పుట్టిన రోజు న కుటుంబమంతా కలిసి ఒక రెస్టారెంట్ కు వెళ్లి సెలబ్రెట్ చేసుకున్నారు. అక్కడ నాగార్జున ఇలా తన కుటుంబాన్ని అంతా కలిపి సెల్ఫీ లో బంధించారు. ఆ సెల్పీ ని ...ట్వీట్ చేసారు. ఈ సెల్ఫీలో నాగార్జున, అక్కినేని అఖిల్, నాగ చైతన్య, అమల లను చూడవచ్చు. తన కుటుంబానికి ఎంత విలువిస్తారో ఎంత ప్రేమ చూపిస్తారో నాగార్జున కొన్ని ఇంటర్వ్యూలు చూస్తే ఇట్టే తెలిసి పోతుంది. ఇంత ప్రేమతో పిల్లల్ని పెంచుకున్నారు కాబట్టే తండ్రిని వెన్నంటి ఉంటూ, తన సలహాలతో ఒక్కో మెట్టూ పైకెదుగుతున్నారీ సుపుత్రులు. ఒక్కమాటలో చెప్పాలంటే.....అచ్చంగా ‘మనం’ సినిమా లాంటి కుటుంబం వీరిది.