భారీ బడ్జెట్ తో తీస్తున్న వివివినాయ్, అఖిల్ అక్కినేనిల సినిమా మొదటి షెడ్యూల్ ముగించుకుంది. ఈ షెడ్యూల్ లో బాంబ్ బ్లాస్టింగ్ ఫైర్స్ వంటి షాట్స్ తో అఖిల్ ఇంట్రడక్షన్ సీన్ చిత్రీకరించారు డైరెక్టర్ వినాయక్. మొదటి షాట్ తోనే ఆది వంటి కొన్ని బ్లాక్ బస్టర్ మూవీలను గుర్తు చేశారట వినాయక్. ఇప్పుడు అఖిల్ డెబ్యూ మూవీ కాబట్టి తన హీరోయిజాన్ని పూర్తిగా ప్రదర్శించే లెవల్లో తనను చూపిస్తున్నారీయన. మొదటి షెడ్యూల్ అంతా ఓల్డ్ సిటీ లో రాత్రి వేళ జరిగే ఫైట్ సీన్ ఇది. ఈ సీన్ పూర్తి చేయడానికి దాదాపు ఒక కోటి ఖర్చు పెట్టారట. అయితే ఈ సన్నివేశం సినిమాలో కనిపించేది మూడు నిమిషాలేనంటున్నారు. మరి మూడు నిమిషాలకే ఇంత ఖర్చ చేస్తే సినిమా మొత్తం పూర్తయ్యేసరికి బడ్జెట్ ఏ లెవల్ కు వెళుతుందోనని ఫిల్మ్ ఇండస్ర్టీలో చర్చలు జరుగుతున్నాయి. ఇక రెండవ షెడ్యూల్ చేయడానికి ఆఫ్రికా అడవులకు యూనిట్ అంతా తరలి వెళ్ళనుందట. సినిమాలోని కొన్ని ముఖ్య మైన సన్నివేశాలు ఈ దట్టమైన అడవుల్లో అయితేనే బాగుంటుందని ఇక్కడ చిత్రీకరించడానికి రెడీ అయ్యారు. మరి ఈ షెడ్యూల్ కు ఎంత ఖర్చవుతుందో... ? నిర్మాత నితిన్ ఈ షెడ్యూల్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. ఏది ఏమైనా నాజూగ్గా... లవ్లీగా కనిపించే అఖిల్ ఈ యాక్షన్ సీన్స్ లో ఏ విధంగా కనిపిస్తాడో తెరమీద చూస్తే గానీ తెలియదు.