నాగార్జున చిన్న తనయుడు అక్కినేని అఖిల్, 'అఖిల్ 'టైటిల్‌తో ది పవర్ ఆఫ్ జువా అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, నితిన్, సుధాకర్‌రెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో హక్కుల కోసం పలు ఆడియో కంపెనీలు పోటీపడినప్పటికీ చివరకు ప్రముఖ ఆడియో సంస్థ లహరి మ్యూజిక్ భారీ మొత్తం చెల్లించి ఈ ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. ఆమధ్య బాహుబలి, రుద్రమదేవి లాంటి ఆడియో లను కూడా విడుదల చేసి ఆడియో రంగం లో సరికొత్త సంచలం సృటించిన విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత మరో సంచలన చిత్రం అఖిల్. ఇక విషయానికొస్తే ఈ చిత్రం ఆడియోను క్రీ శే అక్కినేని నాగేశ్వర్ రావు గారి జన్మ దిన సందర్భంగా ఈనెల 20న గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి హైదరాబాద్ గత్చిబౌలి స్టేడియం లో భారి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి ముందుగా వినాయక చవితి పండుగ సందర్భంగా ముందుగా ఒక పాటను విడుదల చేసారు లహరి మ్యూజిక్ ఆడియో సంస్థ. ఆ పాట వివరాల్లో కి వెడితే అనూప్ రూబెన్స్ సంగీతం తో కృష్ణ చైతన్య రాసిన ఈ గీతం 'హే అఖిల్ '.....అనే పాటను రాహుల్ పాండే,అనూప్ రూబెన్స్ లు పాడారు.
ఈ సందర్భంగా లహరి మ్యూజిక్ అధినేత జి మనోహర్ నాయుడు మాట్లాడుతూ - "అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. 'బాహుబలి' ఆడియో తర్వాత మరో సంచలన చిత్రం 'అఖిల్' ఆడియో హక్కులు కూడా మాకు రావడం సంతోషంగా వుంది. ముఖ్య విషయం వినాయక చవితి పండుగ సందర్భంగా 'అఖిల్ ' చిత్రం లోని ఒక పాటను ఈ రోజు ముందుగా విడుదల చేసాము. ఆ పాట వివరాల్లో కి వెడితే 'హే అఖిల్ '.....అనే పాట అనూప్ రూబెన్స్ సంగీతం తో కృష్ణ చైతన్య రాసిన ఈ గీతం రాహుల్ పాండే,అనూప్ రూబెన్స్ లు పాడారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట కు హీరో అఖిల్ ట్వీట్ చేయడంతో ఈ పాటను విడుదల చేసాం. టైటిల్ సాంగ్ గా వచ్చే ఈ పాట
చిత్రం లో ఒక హై లైట్.. ఈ ఆడియో హక్కులు మాకు ఇచ్చి న సుధాకర్ రెడ్డి గారికి , హీరో నితిన్, మ్యూజిక్ డైరెక్టర్
అనూప్ రూబెన్స్ కి ధన్య వాదాలు." అన్నారు.