కమల్ హాసన్ రెండో తనయ, శృతిహాసన్ ముద్దుల చెల్లెలు అక్షరహాసన్ ‘షమితాబ్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి విదితమే. ఈ సినిమా ఇటు ఆడియెన్స్ నే కాదు, అటు విమర్శకులను సైతం మెప్పించింది. అవకాశాలు వెల్లువలా వస్తున్న సినిమాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ ముందుకెళుతుంది. అయితే ఇటీవల కొన్ని రోజులుగా బాలీవుడ్ నటుడు తనూజ్ విర్వాణితో ప్రేమాయణం సాగిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి అక్షర హాసన్ ఘాటుగానే బదులిచ్చింది. తనకు బాలీవుడ్ లో చాలా మంది స్నేహితులున్నారని, అందరిలో తనూజ్ కూడా ఒకడే తప్ప తనతో ప్రేమాయణం సాగించడం లేదంటూ సమాధానమిచ్చింది. ప్రస్తుతం తనకు సినిమాలే లోకమని, దాని తర్వాతే ప్రేమ, పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పి తనపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టిందీ చెన్నై సుందరి.