హీరో, హాస్య నటుడు, యాంకర్ అలీ సోదరుడు ఖయ్యూం వివాహం ఆదివారం గుంటూరులో అట్టహాసంగా జరిగింది. సన్నిధి కళ్యాణ మండపంలో జరిగిన ఈ వివాహానికి ప్రముఖ రాజకీయనాయకులు, సినీ నటులు హాజరయ్యారు. ఖయ్యూం దాదాపు 50 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించాడు. ఖయ్యూం గుంటూరుకు చెందిన నయాబ్ కమల్ కూతురు హర్షియాను వివాహమాడారు. వివాహానికి నటుడు మురళీ మోహన్, శ్రీకాంత్, అల్లరి నరేష్, ప్రుథ్వీ, వేణు, తరుణ్, వెంకట్, ప్రిన్స్, ఏపీ స్పీకర్ డా. కోడెల శివప్రసాద్, మినిస్టర్ ప్రత్తిపాటి పుల్లారావు మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన ఖయ్యూం రిసెప్షన్ కు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, మరికొందరు రాజకీయ నాయకులు, సినీ, టీవీ ప్రముఖులు, పెద్ద ఎత్తున హాజరై నవ దంపతులు దంపతులు ఖయ్యూం, హర్షియాలకు శుభాకాంక్షలు తెలిపారు.