అలీకి సొంతూర్లో అవమానం

June 08, 2015 | 02:12 PM | 1 Views
ప్రింట్ కామెంట్
ali_shame_feeling_in_rajamundry_niharonline

హాస్య నటుడు అలీ తెలియని తెలుగు వారున్నారంటే ఆశ్చర్యపోవాలి. తెరమీదే కాదు... ఈ మధ్య బుల్లి తెరమీద కూడా బాగా కనిపిస్తున్నాడు... అలాంటి ఆలీని కొంతమంది పోలీసులు అతి భద్రత అనాలో... లేక తమ ఉద్యోగ డాబు ప్రదర్శించడానికో తెలియదు గానీ ఆయనను మాత్రం అవమానించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆలీకి తన సొంత ఊరిలో ఘోర పరాభవం జరిగింది. ఇంతకీ అసలు విషయమేమిటంటే... ఇటీవలే ఆలీ తన సొంత ఊరైన రాజమండ్రిలో జరిగిన నంది నాటకోత్సవాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్లాడు. అక్కడ తనకు మంచి ఆదారణ లభిస్తుందని అనుకున్నాడు. కానీ ఆ కార్యక్రమం వేదికపైకి ఆలీ వెళ్లడానికి ప్రయత్నించినపుడు అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. తాను ఆలీనని, ఈ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చానని ఎంత చెప్పినప్పటికీ పోలీసులు తన మాట వినిపించుకోలేదు. దీంతో ఇక చేసేదేమి లేక అవమానంగా భావించి... ఆలీ అక్కడి నుంచి వెనక్కి బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. కానీ అదే వేదికపై వున్న సినీనటుడు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మురళీ మోహన్.. ఈ విషయాన్ని గమనించి వెంటనే కిందకి దిగి ఆలీని వేదికపైకి తీసుకెళ్లారు. కానీ జరిగిన అవమానానికి అసహనంగానే అక్కడ కూర్చున్నాడట అనీ... నాటకోత్సవాల కోసం తన సొంత ఊరికి వచ్చినందుకు తనకు మంచి మర్యాదే జరిగిందనీ అలీ వాపోయాడట. ఆ తరువాత కార్యక్రమ సభ్యులు ఎంత క్షమాపణలు చెప్పినా... అలీ అవమానంగానే భావించినట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ